Akshay kumar: సెల్ఫీతో గిన్నిస్ రికార్డ్ కొట్టేసిన అక్కీ....

Akshay kumar: సెల్ఫీతో గిన్నిస్ రికార్డ్ కొట్టేసిన అక్కీ....
అత్యధిక సెల్ఫీలు తీసుకున్న నటుడిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అక్షయ్ కుమార్, తొలి రికార్డ్ నెలకొల్పిన హాలీవుడ్ వుడ్ నటుడు డ్వైేన్ జాన్సన్...

బాలీవుడ్ ఖిలాఢీ అక్షయ్ కుమార్ సరికొత్త స్టంట్ తో ఏకంగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. సాధారణంగా వెండితెరపై అదిరిపోయే స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే అక్కీ ఈసారి సింపుల్ గా సెల్ఫీలతో రికార్డ్ నెలకొలిపాడు. అక్షయ్ కుమార్ తాజాగా సెల్ఫీ సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్న సంగతి తెలిసిందే. మళయాళీ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ తో పాటూ ఇమ్రాన్ హష్మీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ అభిమానులతో మూడు నిమిషాల పాటూ ఏకధాటిగా సెల్ఫీలు దిగి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కు ఎక్కాడు. అభిమానులకు ఈ గిన్నిస్ రికార్డ్ ను అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. తాను ఇంత వరకూ వచ్చింది అభిమానుల వల్లే అంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు తీసుకున్న అక్షయ్ 2018లో జేమ్స్ స్మిత్ నెకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ మేరకు అధికారులు గిన్నిస్ బుక్ తరుఫున గుర్తింపు పత్రాన్ని అందించారు. 2015లో సాన్ అండ్రీయాస్ ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 105 సెల్ఫీలతో తొలి రికార్డ్ నెలకొల్పాడు.

Tags

Read MoreRead Less
Next Story