Alia : మరోసారి తల్లి అవ్వబోతోందా....!

Alia : మరోసారి తల్లి అవ్వబోతోందా....!
ఆలియా ట్వీట్; రెండో ప్రెగ్నెస్సీ గురించే అంటూ....

ఇటీవలే తల్లిదండ్రులైన ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ రెండో సంతానం కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ మధ్య ఆలియా షేర్ చేసిన ఇన్స్టా పోస్టు చూస్తే అందులో ఏమాత్రమో నిజం ఉందని మనకూ అనిపించక మానదు మరి. మాతృత్వపు మాధుర్యాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తోన్న ఆలియా ఈ మధ్య ఓ మెటర్నటీ వేర్ బ్రాండ్ కు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అడపా దడపా మెటర్నటీ వేర్ లో దర్శనమిస్తోంది. దీంతో పాటే ఓ పోస్ట్ లో చూచాయిగా ఎదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. రెండు పువ్వులు పట్టుకుని తన ఫొటోను షేర్ చేసిన ఆలియా '2.0 స్టే ట్యూన్డ్' అంటూ ఓ క్రిప్టిక్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇంకే ముంది ఆలియా రెండో సారి తల్లి అవ్వబోతోందంటూ జనాలు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అందుకే అమ్మడు వచ్చిన ఆఫర్లు అన్నింటినీ తోసి పుచ్చుతోందని అంటున్నారు. ఏమైనా ఈ విషయంలో ఎంత నిజముంది అన్నది ఆలియా, రణ్ బీర్ కే తెలియాలి.



Tags

Read MoreRead Less
Next Story