Alia Bhatt: ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతోనే ఆ రేంజ్‌లో సంపాదిస్తున్న ఆలియా భట్..

Alia Bhatt: ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతోనే ఆ రేంజ్‌లో సంపాదిస్తున్న ఆలియా భట్..
Alia Bhatt: ఆలియా భట్‌కు ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Alia Bhatt: సినీ సెలబ్రిటీలకు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత వారు కేవలం సినిమాలతోనే కాదు యాడ్స్, పోస్టుల వల్ల కూడా చాలానే సంపాదిస్తూ ఉంటారు. వారికి ఉన్న ఫాలోవర్స్ సంఖ్యను బట్టి, వారికి వస్తున్న యాడ్స్‌ను బట్టి ఈ రెమ్యునరేషన్ డిసైడ్ అవుతుంది. ఇక తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్.. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ఆలియా భట్ ఓ స్టైలిష్ హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. కానీ ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ, తనలోని నటిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అందుకే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆలియా తన సినిమాలతో బిజీగానే ఉంది. అంతే కాకుండా మరోవైపు బ్రాండ్స్ యాడ్స్‌లో కూడా పాల్గొంటోంది.

ఆలియా భట్‌కు ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తను ఏదైనా బ్రాండ్‌కు సంబంధించి ఒక్క పోస్ట్ పెట్టాలన్నా రూ.85 లక్షల నుండి కోటి వరకు రెమ్యునరేషన్‌గా అందుకుంటుందట. అంతే కాకుండా బ్రాండ్ వాల్యూకు సంబంధించి ఈ రేటు పెరిగే ఛాన్స్ కూడా ఉందట. దీన్ని బట్టి చూస్తే సినిమాల్లోనే కాదు ఇన్‌స్టాగ్రామ్‌తో కూడా ఆలియా రెండు చేతులా సంపాదిస్తోందని అర్థమవుతోంది.



Tags

Read MoreRead Less
Next Story