ఆయన సపోర్ట్‌తో నేనేమైనా చేయగలను: అనుష్క

అనుష్క శర్మ అమ్మ కాబోతున్న ఆనంద క్షణాలను అనుభవిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటోంది.. గర్భం దాల్చినా తన రోజువారి కార్యక్రమాలతో పాటు షూటింగ్స్‌కి కూడా హాజరవుతూ తల్లి కాబోతున్న మహిళలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. యోగాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే అనుష్క కష్టమైన శీర్షాసనాన్ని కూడా అవలీలగా చేసేస్తోంది. భర్త కోహ్లీ సపోర్ట్‌తో ఈజీగా చేసేస్తూ నెటిజెన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మంగళవారం (డిసెంబర్ 1) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనుష్క ఆసనం వేసిన ఫోటోను పోస్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో యోగా టీచర్ వీక్షిస్తుండగా భర్త కోహ్లీ సపోర్ట్‌తో ఈ ఆసనం వేశానని తెలిపింది. యోగా నా జీవితంలో ఒక పెద్ద భాగం కాబట్టి, నేను గర్భవతి కాకముందే యోగాసనాలు ప్రతి రోజూ చేసే దాన్ని. గర్భం దాల్చిన తరువాత కూడా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నాను. ముందుకు వంగి చేసే ఆసనాలు మినహా నేను చేస్తున్న అన్ని ఆసనాలను చేయమని నా వైద్యుడు సిఫారసు చేసాడు.
అవసరమైన మద్దతుతో చాలా సంవత్సరాలుగా చేస్తున్న శిర్షాసనాన్ని కూడా ఈ సమయంలో వేయడానికి అభ్యంతరం లేదని నా యోగా గురువు సలహా మేరకు ఈ ఆసనం వేశానన్నారు. గర్భంతో ఉన్నప్పుడు కూడా అభ్యాసాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది "అని అనుష్క ఈ పోస్ట్‌కు శీర్షిక పెట్టారు.
ఫోటోలో, అనుష్క గోడ సపోర్ట్ తీసుకుని ఆసనం వేస్తుంది. కోహ్లీ ఆమె పట్టుకొని కష్టమైన ఆసనంలో సహాయాన్ని అందించడాన్ని చూడవచ్చు. అనుష్కతన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌లతో అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఆమె రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడడంతో పాటు ఫోటోలను పంచుకుంటుంది. అనుష్క ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు ఆమె అభిమానులకు నిజమైన ట్రీట్. 2021 జనవరిలో అనుష్క తన మొదటి బిడ్డకు జన్మనిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com