'దంగల్' బ్యూటీ అందాలు అదరహో..

దంగల్ బ్యూటీ అందాలు అదరహో..
తాజాగా పింక్ శారీలో మెరిసిపోయింది.

ల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన అందాల తార ఫాతిమా సనా షేక్. రెజ్లర్‌గా ఫాతిమా పోషించిన పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది ఫాతిమా. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో కనిపించినా ఆశించిన స్థాయిలో ఆ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పింక్ శారీలో మెరిసిపోయింది. లేత గులాబీ రంగులో తన అందం మరింత పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాయి. ఫాతిమా నటించిన లూడో చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైంది. మరోవైపు దిల్జీత్ దోసాంజ్‌తో కలిసి సూరజ్ పే మంగల్ భరీ చిత్రంలో నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా సిల్వర్ స్క్రీన్‌పై నటించిన ఫాతిమా తెలుగులో నువ్వు నేను ఒక్కటవుదాం మూవీలో నటించింది.
















Tags

Read MoreRead Less
Next Story