Bollywood: మరోసారి పెళ్లాడిన మసాబా...

Bollywood: మరోసారి పెళ్లాడిన మసాబా...
నీనాగుప్తా-వివిరిచర్డ్స్ గారాలపట్టి, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్త...

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది సీనియర్ నటి నీనాగుప్త తనయురాలు మసాబా గుప్తా. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివి రిచర్డ్స్, నీనా గుప్తాల గారాల పట్టిన అయన మసాబా ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించి నటిగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమ్మడు చడీచప్పుడూ లేకుండా పెళ్లాడేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేసింది.


కొంతకాలంగా మసాబా లాయర్ కమ్ యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తోంది. ఇహనో ఇప్పుడో పెళ్లి ముచ్చట చెబుతారని ఎదురుచూస్తుండగా సడన్ గా పెళ్లి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. పలుపురు అతిథుల నడుమ ఇరువురూ ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ఇన్స్టా పోస్ట్ కు లైకులు, కామెంట్లు వర్షంగా కురుస్తున్నాయని ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు.


మసాబాకు 2015లో తెలుగు ప్రొడ్యూసర్ మధు మంతెనను వివాహమాడింది. అయితే కొంతకాలానికే పొరపొచ్చాలు తలెత్తడంతో 2018లో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. 2019లో కోర్డు వీరికి విడాకులు మంజూరు చేసింది.



Tags

Read MoreRead Less
Next Story