Bollywood: బాగా మారిపోయావ్ సీత...!

Bollywood: బాగా మారిపోయావ్ సీత...!
సెల్ఫీ సినిమాలో రెచ్చిపోయిన సీత; అదిరిపోయిన మృణాల్ హాట్ లుక్స్...
సీతారామంలో సీతగా దక్షిణాదివారిని కట్టిపాడేసిన మృణాల్ ఠాకుర్... నెక్స్ట్ సినిమాకే అందాల విందు వడ్డించేసింది. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ సరసన సెల్ఫీ అనే సినిమాలో నటిస్తోన్న మృణాల్... అందుకు తగ్గట్లుగానే గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవలే సినిమాకు సంబంధించిన కుడియేనీ తేరీ సాంగ్ స్నిప్పెట్స్ రిలీజ్ అవ్వగా అందులో అమ్మడి అందాల అరచాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నమొన్నటివరకూ సీతగా కనపించి, తెలుగు వారి హృదయాలపై బలమైన ముద్ర వేసిన అందాల గుమ్మ.. ఒక్కసారిగా ఇలా చిట్టిపొట్టి దుస్తుల్లో విరుచుకుపడటం మనోళ్లకు కాస్త మింగుడుపడని విషయంగా మారిందని ఒప్పుకోవాల్సిందే. ఏమైనా కొత్త అవతారంలోనూ మృణాళ్ అద్భుతంగా ఉందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అమ్మడి స్టైల్, కాన్ఫిడెన్స్ అన్నీ సరిగ్గా సెట్ అయిపోయాయి. మరి స్నిప్పెట్సే ఇంత దుమారం లేపితే... ఫుల్ సాంగ్, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story