Cinema: ఎన్టీఆర్ కావాలంటే ఆ మాత్రం ఉండాలమ్మా....

Cinema: ఎన్టీఆర్ కావాలంటే ఆ మాత్రం ఉండాలమ్మా....
వార్ లో హృతిక్ తో పాటూ కీలక పాత్ర పోషించనున్న తారక్; భారీ రెమ్యునరేషన్ వసూలు చేయనున్న ఎన్టీఆర్

RRR దెబ్బకి గ్లోబల్ స్టార్ అయిపోయిన జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో భారీగా లాంచ్ అయ్యేందుకు సిద్ధమయ్యాడు. వార్ సినిమా సీక్వెల్ లో హృతిక్ తో పాటూ యంగ్ టైగర్ కూడా ప్యారలెల్ లీడ్ రోల్ కు ఖరారు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. సుమారు రూ. 30 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా అలరించబోతున్నాడట. యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ లో అఫీషియల్ గా లాంచ్ అవుతోన్న యంగ్ టైగర్ అక్కడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story