Farhan Akhtar: 'జీతాలు ఇవ్వడం లేదు'.. హీరోపై సినీ కార్మికుల ఆరోపణ..

Farhan Akhtar: జీతాలు ఇవ్వడం లేదు.. హీరోపై సినీ కార్మికుల ఆరోపణ..
Farhan Akhtar: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌కు ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఉంది.

Farhan Akhtar: మామూలుగా సినిమా అనేదానికి దర్శకుడు, నిర్మాత, నటీనటులు ముఖ్య అంశాలుగా ఉన్నా.. వెనుక ఎంతోమంది కష్టం కూడా ఉంటుంది. ఏ క్రెడిట్ దక్కకపోయినా ఒక సినిమా కోసం పనిచేసే వారు చాలామంది ఉంటారు. వారికి సమయానికి జీతం వస్తే చాలు అని తృప్తిపడుతుంటారు. కానీ అలాంటి వారితో ఎక్కువగా పనిచేయించుకుని జీతాలు ఇవ్వలేదట ఓ బాలీవుడ్ హీరో. దీంతో సినీ కార్మికులు మీడియాను ఆశ్రయించారు.

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అఖ్తర్‌కు ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఉంది. తన స్నేహితుడు రితేష్ సిద్వానీతో కలిసి ఈ సంస్థను చూసుకుంటున్నాడు ఫర్హాన్. అయితే ఇటీవల 'మిర్జాపూర్ 3' షూటింగ్ కోసం కొందరు సినీ కార్మికులను తీసుకెళ్లారు. అయితే దానికి సంబంధించి దాదాపు రూ.25 నుండి 30 లక్షలు పేమెంట్స్ బాకీ ఉన్నాయని ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్‌కు సినీ కార్మికులు చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయారు.

ఎక్కువ పని చేయించుకున్నారు, సరిగ్గా భోజన వసతులు కూడా కల్పించలేదని సినీ కార్మికులు మీడియాకు తెలిపారు. ఈ ఘటన తర్వాత వెంటనే స్పందించిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ అసలు వారు తమని సంప్రదించలేదని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా 48 గంటల్లో పేమెంట్స్ అందుతాయని హామీ ఇచ్చారు. ఎన్నో ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్న ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ పేమెంట్స్ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఈ విషయంలో విచారణ జరపాలని ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ ఓనర్స్ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story