Hansika: వెబ్ సిరీస్ గా అమ్మడి వివాహ వేడుక....

ప్రేమ, పెళ్లి, డ్రామా... వెబ్ సిరీస్ గా అమ్మడి పెళ్లి ముచ్చట; విడుదలైన ట్రైలర్; సినిమాకేం తీసిపోలేదు సుమా.....

ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడితో మూడుముళ్లు వేయించేసుకుని ఓ ఇంటిదైపోయింది యాపిల్ బ్యూటీ హన్సిక. ఇక తీరిగ్గా హనీమూన్ ముచ్చట ముగించుకుని వచ్చిన హన్సిక మళ్లీ వర్క్ మోడ్ లోకి దిగిపోయింది. ఈసారి వెబ్ సిరీస్ తో పనికి శ్రీకారం చుట్టింది అమ్మడు. అయితే ఈ వెబ్ సిరీస్ హన్సిక పెళ్లి ముచ్చటే కావడం విశేషం. సొహైల్ ఖతురియాతో ఏడడుగులు వేసిన హన్సిక తన వివాహ వేడుకను వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. 'లవ్ షాదీ డ్రామా' పేరిట ఈ వెబ్ సిరీస్ విడుదలవ్వబోతోంది. డిస్నీ హాట్ స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతోంది. అయితే ఈ సిరీస్ ఓ భారీ బడ్జెట్ సినిమాకేం తీసిపోకుండా తెరకెక్కించారని అర్థమవుతూనే ఉంది. ఇక ట్రైలర్ స్టార్టింగ్ లోనే గతంలోనూ పబ్లిక్ కు తెలిసే విధంగానే ఓ బంధంలో కొనసాగానని, అయితే ఈసారి మళ్లీ అదే విధంగా చేయదలచుకోలేదని స్పష్టం చేసింది అమ్మడు. గతంలో కోలీవుడ్ హీరో శింబుతో అమ్మడి ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటూ పెళ్లి పనులు, హడావిడి, వాటి వెనుక పెళ్లికూతురుగా హన్సిక పడిన టెన్షన్ అన్నీ కళ్లకు కట్టారని అర్థమవుతోంది. ఏమైనా ట్రైలర్ చూస్తుంటే కీప్ అప్ విత్ కార్ధార్షియన్స్ అనే రియాలిటీ షో గుర్తుకు రాక మానదు. మరి హన్సిక సెకండ్ ఇన్నింగ్స్ ఈ విధంగా మొదలవుతుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story