సుశాంత్‌తో సహజీవనం..రియాపై ఈ ఆరోపణలు

సుశాంత్‌తో సహజీవనం..రియాపై ఈ ఆరోపణలు

సుశాంత్‌తో సహజీవనం..రియాపై ఈ ఆరోపణలు
X

హీరో సుశాంత్‌సింగ్‌ మృతి కేసును చేధించే పనిలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తున్నారు. మొన్న ఏకబిగిన 10 గంటల పాటు సీబీఐ అధికారులు రియాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నిన్న 9 గంటల పాటు సీబీఐ అధికారులు రియాను విచారించారు. సుశాంత్‌తో సహజీవనం చేసిన రియాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలోనూ వీరిపై ఆరోపణలు వస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే రియాను విచారించింది.

డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలు.. మహేష్ భట్‌తో ఉన్న పరిచయంపై సీబీఐ రియా చక్రవర్తిపై ప్రశ్నల వర్షం కురిపించింది. రియా ఓ దశలో సహనం కోల్పోయి తనను విచారిస్తున్న సీబీఐ మహిళా అధికారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలు అడగడంపై రియా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. రియా ఇవాళ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

సుశాంత్‌ మరణంపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ఓ విషకన్యగా అభివర్ణించారు. విషకన్యను కదిలిస్తే సుశాంత్‌ను డ్రగ్స్‌ మత్తులో ముంచెత్తి, హత్య చేయడం వరకు అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు.

అటు బాలీవుడ్‌లో డ్రగ్స్‌ అంశం టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా.. టాలీవుడ్‌పై బీజేపీ నేత, సినీనటి మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని ఆమె అన్నారు. తెలంగాణ ఎన్సీబీ అధికారులు టాలీవుడ్‌పై దృష్టిపెట్టాలని మాధవిలత సూచించారు. సుశాంత్ డ్రగ్స్ వాడకం బాగా ఉందన్న మాట వాస్తవమేనన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌతం డ్రగ్స్ వాడకం ఎక్కువైందంటూ ఆమె తన ఫేస్ బుక్ వాల్ పై పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES