Kangana Ranaut: నిన్న ప్రశంసలు... నేడు పెదవి విరుపులు...

Kangana Ranaut: నిన్న ప్రశంసలు... నేడు పెదవి విరుపులు...
పఠాన్ సక్సెస్ పై స్పందించిన కంగన; నిన్న సినిమాపై ప్రశంసలు; నేడు ట్విట్టర్ లో విరుపులు...

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ట్విట్టర్ అకౌంట్ లో మరోసారి యాక్టివ్ గా మారింది. ఇటీవలే తన తాజా సినిమా ఎమర్జెన్స్ సెట్స్ లో పఠాన్ సినిమా బాగుందని, ఈ సినిమా రాణించాలని వ్యాఖ్యానించిన అమ్మడు రోజు తిరిగేసరికి ప్లేటు ఫిరాయించేసింది.

ఈ రోజు ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ కంగన పఠాన్ సినిమాను టార్గెట్ చేస్తూ మాటల తూటాలను వదిలింది. పఠాన్ లో షారుఖ్ దగా పడ్డ భారత ఏజెంట్ గా నటించగా, ఓ పాకిస్థానీ ఏజెంట్ ప్రేమలో పడ్డట్లు కథ నడిపించారు. దీనిపై కంగన తనదైన స్టైల్ లో ట్వీట్ చేసింది. కుట్రపై గెలుపొందిన ప్రేమ అంటూ పఠాన్ ను ఆశాకానికి ఎత్తేస్తున్నారు. కానీ, ఎవరిది ప్రేమ, ఎవరిది కుట్ర అంటూ ప్రశ్నించింది. సినిమాను చూసేదెవరు, దాన్ని హిట్ దిశగా నడిపించేది ఎవరు అని అంటూనే, ఇది భారతీయుల ప్రేమ, అందులోనూ 80శాతం ఉన్న హిందువులే ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారంటూ ట్వీట్ చేసింది.


శత్రుదేశం పాకిస్తాన్ ను, ఐఎస్ఐ ఏజెంట్లనూ గొప్పవారిగా చిత్రించడం, దానికి ఇంత ఆదరణ లభంచడం ఎంతవరకూ సమంజం అని నిలదీసింది. అయినా అన్నింటికీ అతీతంగా భారతీయులు ఈ చిత్రాన్ని ఆమోదించడమే ప్రత్యర్థుల నీచ కుట్రలపై విజయం సాధించడం అని పేర్కొంది. ఏమైనా ఈ సినిమాపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న వారి కోసం పఠాన్ కేవలం ఓ చిత్రం మాత్రమేనని గుర్తుచేసింది. ఇక్కడ మాత్రం జై శ్రీరామ్ నినాదం మాత్రమే వినిపిస్తుంది అంటూ కొసమెరుపు ఇచ్చింది.




Tags

Read MoreRead Less
Next Story