Top

జల్లికట్టు సినిమా ఆస్కార్‌కు: కంగన కామెంట్

మన దేశం తరపున జల్లికట్టును ఎంపిక చేశారు.

జల్లికట్టు సినిమా ఆస్కార్‌కు: కంగన కామెంట్
X

ఆస్కార్ అవార్డుకు మన దేశం నుంచి మలయాళ చిత్రం జల్లికట్టును ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ఎంపిక చేయడాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వాగతించారు. చిత్ర యూనిట్‌ను ఆమె అభినందించారు. 93వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మన దేశం తరపున జల్లికట్టును ఎంపిక చేశారు. బాలీవుడ్ మాఫియాకు చెక్ పెట్టి, ఆస్కార్ పోటీకి మంచి సినిమాను ఎంపిక చేశారని కంగన పేర్కొన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నాలుగు కుటుంబాలకే పరిమితం కాదని, జల్లికట్టును ఆస్కార్‌కు ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES