Katrina Kaif: కత్రినా గుడ్ న్యూస్ చెప్పబోతోందా!? అందుకేనా అంత కంగారు...

Mumbai
Katrina Kaif: కత్రినా గుడ్ న్యూస్ చెప్పబోతోందా!? అందుకేనా అంత కంగారు...
కెమెరాలను తప్పించుకుని తిరుగుతోన్న కత్రినా, అసలు విషయం అదేనంటోన్న నెటిజెన్లు!

Katrina Kaif: కత్రినా గుడ్ న్యూస్ చెప్పబోతోందా!? అందుకేనా అంత కంగారు...


బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఓ వైపు ఇంటికి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు షూటింగ్ లనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. విక్కీ కౌశల్ ను పెళ్లాడాక కాస్త నిలకడగా కనిపిస్తోన్న క్యాట్ ఇప్పుడు మరో మధురమైన ఘట్టంలోని అగుడుపెట్టబోతోందని వినిపిస్తోంది.


విషయం ఏమిటంటే ఈ మధ్య కత్రినా కెమెరాలను కాస్త తప్పించుకుని తిరుగుతోందట. అత్తగారింట క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న క్యాట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలన్నింటిలోనూ ఎవరో ఒకరి వెనుక దాక్కుని ఉండేందుకు ప్రయత్నించింది. ఆమె ఆహార్యం మొత్తం కవర్ అయ్యేలా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఇక నెటిజెన్లకు అప్పుడే అనుమానం మొదలైందని చెప్పాలి.


ఇక ఈరోజు భర్తతో పాటూ ముంబై ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన కత్రినా వదులుగా ఉన్న డ్రెస్ లో దర్శనమిచ్చింది. అయితే కారు దిగుతూనే క్యాట్ హడావిడిగా విమానాశ్రయం లోపలికి పరిగెత్తడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కంగారులో సెక్యూరిటీ చెక్ కూడా దాటేసింది. ఇక అక్కడి సీఆర్పీఎఫ్ అధికారి ఆమెను సెక్యూరిటీ చెక్ వద్దకు రావాల్సిందిగా చెప్పడంతో కత్రినా తిరిగి బయటకురాక తప్పలేదు.


అయితే ఇదంతా అమ్మడు తల్లి కాబోతుండటం వల్లనేనని తెలుస్తోంది. అప్పుడే మీడియాకు గుడ్ న్యూస్ ను షేర్ చేయకూడదని అనుకున్నారో ఏమో మొత్తానికి కత్రినా తీరు మాత్రం అన్ని విధాలుగా అదే విషయాన్ని సూచిస్తోంది. మరి ఇందులో ఎంత వరకూ నిజముందో ఆమెకే తెలియాలి.


Tags

Read MoreRead Less
Next Story