Malika Arora Jogging:ఏమ్మా రోడ్డేమైనా నీ బాబుదనుకున్నావా: నటిపై ట్రోల్స్

Malika Arora Jogging:ఏమ్మా రోడ్డేమైనా నీ బాబుదనుకున్నావా: నటిపై ట్రోల్స్
Malika Arora Jogging: యోగా, జిమ్, వర్కవుట్లు, జాగింగ్ అంటూ ఫోకస్ అంతా ఫిట్‌నెస్‌ పైనే. ఇటీవల ఫిట్‌నెస్

వెండితెర వేల్పులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక పొట్టి బట్టలేసుకుని పొద్దున్నే జాగింగ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది. జాగ్ చేసే మరికొందరి గుండె ఆగిపోదూ.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా 40 ల్లో కూడా నాజూగ్గా ఉంటూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తోంది.. యోగా, జిమ్, వర్కవుట్లు, జాగింగ్ అంటూ ఫోకస్ అంతా ఫిట్‌నెస్‌ పైనే. ఇటీవల ఫిట్‌నెస్ ఫ్రీక్ సర్వేష్ శశితో కలిసి బాంద్రాలోని రోడ్లపై జాగింగ్ వెళుతోంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో నెటిజన్స్ ఆమెని ఓ రేంజ్‌లో వేసుకున్నారు. రోడ్డు మధ్యలో జాగింగ్ ఏవిటి.. ఇంకెక్కడా ప్లేస్ లేదా.. బోల్డు పార్కులు ఉన్నాయి, వాటి చుట్టూ చక్కర్లు కొట్టొచ్చు కదా. రోడ్డు మధ్యలో జాగింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన మలైకా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నర్తించింది. భర్త అర్బాజ్ ఖాన్‌కు విడాకులిచ్చి తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story