Mallika Sherawat: 'కమిట్‌మెంట్స్ ఇవ్వనందుకే నాతో స్టార్ హీరోలు నటించలేదు'

Mallika Sherawat: కమిట్‌మెంట్స్ ఇవ్వనందుకే నాతో స్టార్ హీరోలు నటించలేదు
Mallika Sherawat: బాలీవుడ్‌లో కమిట్‌మెంట్స్‌పై మరోసారి ఓపెన్ కామెంట్స్ చేశారు నటి మల్లికాషెరావత్.

Mallika Sherawat: బాలీవుడ్‌లో కమిట్‌మెంట్స్‌పై మరోసారి ఓపెన్ కామెంట్స్ చేశారు నటి మల్లికాషెరావత్.. A-లిస్ట్ హీరోలకు కమిట్‌మెంట్స్ ఇవ్వనందుకే తనతో నటించేందుకు నిరాకరించారంటూ మల్లికాషెరావత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాళ్లు తెల్లవారు జామున 3 గంటలకు ఇంటికి రమ్మని పిలుస్తారని.. అలా చేస్తేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని రివిల్ అయ్యింది. నేను అలా కాదు.. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు అని చెప్పుకొచ్చింది మల్లికా..


తాను మర్డర్‌ మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి రొమాంటిక్ సినిమాల్లో నటిస్తే తనపై విమర్శలు గుప్పించారని మల్లికా చెప్పారు. కానీ గెహ్రాయాన్‌ సినిమాలో దీపికా పదుకొనే అలాంటి సన్నివేశాల్లో నటిస్తే.. అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. అలాగే 'ఇండస్ట్రీలోని ఒక వర్గం మానసికంగా హింసించిందని తన గోడును వెల్లబోసుకున్నారు. మల్లికా షెరావత్ ఏ విషయం గురించైనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. అవసరమైతే బోల్డ్ స్టేట్‌మెంట్‌లు చేయడానికి కూడా వెనుకాడదు.


దాదాపు రెండు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది. కొంతకాలంగా తక్కువగా సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఇటీవల 'ఆర్‌కే/ఆర్‌కాయ్' అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్లికా బాలీవుడ్ స్టార్ హీరోలపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా కంట్రాక్ట్, పోలీస్ టైగర్, జీనాత్, పంబట్టం వంటి సినిమాలు చేస్తూ కెరీర్‌లో మళ్లీ బిజీగా మారుతోంది.

Tags

Read MoreRead Less
Next Story