Manoj Bajpayee: ఆమె కాస్త తగ్గాల్సిందే మరి...!

Manoj Bajpayee: ఆమె కాస్త తగ్గాల్సిందే మరి...!
సమంతకు మనోజ్ సలహా; ఆ విషయంలో కాస్త తగ్గాలంటూ హితువు; సమంత రిప్లై....

మయోసిటీస్ నుంచి క్రమంగా కోలుకుంటోన్న సమంత మళ్లీ సినిమాలతో బిజీగా మారుతోంది. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్ట్స్ రాజ్-డీకే సిటాడెల్ సెట్స్ మీదకు వెళ్లడంతో షూటింగ్ లోనూ పాలుపంచుకుంటోంది. ఈ సిరీస్ లో సమంత, వరణ్ కు జోడీగా కనిపించనుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సమంత పై విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో వైరల్ గా మారాయి. ఇటీవలే ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ నిమిత్తం మీడియాతో ముచ్చటించిన మనోజ్ సమంత తనని తాను ఎంతగానో కష్టబెట్టుకుంటుందని వ్యాఖ్యానించాడు. ఆమె శ్రమ జీవి అంటూ ప్రశంసించాడు. ఫ్యామిలీ మాన్ సిరీస్ చేస్తున్నప్పుడు ఆమె పాత్ర కోసం తనని తాను కష్టపెట్టుకుంటోన్న వైనం చూసి భయపడినట్లు వెల్లడించాడు. ఆ విషయంలో ఆమె కాస్త నెమ్మదించాలని, తన పట్ల తాను కాస్త సున్నితంగా వ్యవహరించుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారడంతో సమంత కూడా తన సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేసింది. తప్పుకుండా ప్రయత్నిస్తాను సర్ అంటూ స్పందించింది. ఏమైనా సమంత త్వరగా కోలుకుని, ఇంతకు ముందుకన్నా మరింత ధృఢంహా మారాలని అభిమానులు సైతం కోరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story