'తాండవ్' వెబ్ సిరీస్‌పై ఫైర్.. సైఫ్ ఇంటికి భారీ భద్రత

తాండవ్ వెబ్ సిరీస్‌పై ఫైర్.. సైఫ్ ఇంటికి భారీ భద్రత
ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెలుపల ఒక పోలీసు వ్యాన్‌తో పాటు మరి కొంతమంది పోలీసు అధికారులు ఆదివారం కాపలా కాశారు.

సినిమా కానీ సిరీస్‌కానీ ఏదైనా వినోదాన్ని పంచాలే కాని విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉండకూడదని ఈ ఉదంతం మరోసారి రుజువు చేస్తోంది.ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెలుపల ఒక పోలీసు వ్యాన్‌తో పాటు మరి కొంతమంది పోలీసు అధికారులు ఆదివారం కాపలా కాశారు. 'మత మనోభావాలను దెబ్బతీసినందుకు' సైఫ్ షో తాండవ్‌కు వ్యతిరేకంగా పలువురు రాజకీయ నాయకులు, నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాండవ్ చుట్టూ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో సైఫ్‌కు అదనపు భద్రత ఇచ్చినట్లు తెలుస్తోంది. సైఫ్ కుటుంబం పాత ఇంటికి దగ్గరలో కొత్త ఇల్లు కొన్నారు. వారి సిబ్బంది పాత ఇంటిలో ని వస్తువులను కొత్త ఇంటికి తరలిస్తున్నారు.

హిందువుల మత మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కు చెందిన పలువురు నాయకులు తాండవ్ నిషేధించాలని పిలుపునిచ్చారు. ముంబైలోని ఘాట్కోపర్ పోలీస్ స్టేషన్లో వెబ్ సిరీస్ తయారీదారులపై మహారాష్ట్రలోని పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదివారం ఫిర్యాదు చేశారు.

శివుడిని అపహాస్యం చేస్తున్న భాగాన్ని తొలగించాలని, నటుడు మహ్మద్ జీషన్ అయూబ్ నుండి క్షమాపణ చెప్పాలని కదమ్ ట్వీట్ చేశారు. "అవసరమైన మార్పులు చేసే వరకు తాండవను బహిష్కరిస్తామని అన్నారు. "సినిమాలు, సీరియల్స్ సమీక్షించడానికి సెన్సార్ల వ్యవస్థ ఉన్నట్లే, OTT ప్లాట్‌ఫాంపై సిరీస్‌ను సమీక్షించడానికి కూడా ఓ సెన్సార్ ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు.

ఈ సిరీస్‌ దేవుళ్లను ఎగతాళి చేయడం, సెక్స్, హింస, మాదక ద్రవ్యాల వాడకంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలీ అబ్బాస్ దర్శకత్వం వహించిన తాండవ్‌లో జాఫర్, సునీల్ గ్రోవర్, డింపుల్ కపాడియా, గౌహర్ ఖాన్, కృతిక కమ్రా తదితరులు నటించారు. దీనిపై సమీక్షలు కూడా విమర్శనాత్మకంగానే వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story