Top

నటుడు న్యూడ్‌ రన్నింగ్‌పై నటి కామెంట్‌

నటుడు న్యూడ్‌ రన్నింగ్‌పై నటి కామెంట్‌
X

బాలీవుడ్ నటుడు... మోడల్ మిలింద్ సోమన్‌.. బీచ్‌లో న్యూడుగా పరిగెడుతున్న ఫోటోను పోస్ట్‌ చేయడం తీవ్ర వివాదాస్పమైంది. గోవా బీచ్‌లో హ్యాపీగా న్యూడ్ రన్నింగ్‌ చేసిన మిలింద్‌పై... స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.. తాజాగా బాలీవుడ్ నటి పూజా బేడీ.. మిలింద్ న్యూడ్ ఫోటో ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. మిలింగ్‌ సోమన్ న్యూడ్ రన్నింగ్‌ ఫోటో చాలా అందంగా ఉందని.. అందులో ఎలాంటి అశ్లీలత లేదని... పూజా బేడీ కామెంట్ చేశారు.

అశ్లీలత అనేది వ్యూయర్స్‌ అతిగా ఊహించుకోవడంలో ఉంటుందని ట్వీట్ చేశారు పూజా బేడీ. మిలింద్ తప్పు ఏమిటంటే... అతడు అందంగా ఉంటాడన్నారు. ఫేమస్‌ వ్యక్తి కావడం.. బెంచ్ మార్క్ సెట్‌ చేయడమే అతడి దోషమా అని పూజా బేడీ ప్రశ్నించారు. పైగా... ఒక వేళ న్యుడిటీ క్రైమ్‌ అయితే.. నాగ సాధవులుందరినీ అరెస్ట్ చేయాలన్నారు. ఒంటిపై బూడిద పూసినంత మాత్రానా... అలా ఉండటం ఆమోదయోగ్యం కాదు కదా అని ట్వీట్ చేశారు. గత వారం తన 55వ పుట్టిన రోజు సందర్భంగా.. గోవా బీచ్‌లలో.. మిలింద్ సోమన్ న్యూడ్‌గా రన్నింగ్ చేసిన పోస్ట్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు సెలిబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Next Story

RELATED STORIES