Ralia: క్రిస్మస్ కు కూతురిని పరిచయం చేయనున్న రణ్ బీర్, ఆలియా!?

Mumbai
Ralia: క్రిస్మస్ కు కూతురిని పరిచయం చేయనున్న రణ్ బీర్, ఆలియా!?
ఇటీవలే ఓ చిన్నారి చిట్టితల్లికి తల్లితండ్రులైన రణ్ బీర్, ఆలియా. క్రిస్మస్ పురస్కరించుకుని రాహాను పరిచయం చేయబోతున్నారట !!

Bollywood : బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణ్ బీర్, ఆలియా తమ జీవితంలో మధురమైన ఘట్టంలోకి ప్రవేశించారు. ఇటీవలే ఓ చిన్నారి చిట్టితల్లికి తల్లిదండ్రులైన ఈ ముచ్చటైన జంట త్వరలోనే తమ బంగారుతల్లిని లోకానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారట. క్రిస్మస్ కు ముహూర్తం కూడా పెట్టేశారని తెలుస్తోంది.


నవంబర్ 6న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆలియా పాపాయి పుట్టిన దగ్గర నుంచి పూర్తిగా ఇన్ కాగ్నిటో మోడ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి. రణ్ బీర్ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలానే ఉంది. ఇరువురూ చిన్నారి సంరక్షణ బాధ్యతల్లోనే మునిగితేలుతున్నారని అర్ధమవుతోంది.


ఇక పాపాయికి రాహా అని నామకరణం చేసిన రాలియా జంట, చిన్నారికి సంబంధించి ఒక్క హింట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తల్లిదండ్రులుగా తమ చిట్టితల్లిని మీడియా లైమ్ లైట్ కు దూరంగా ఉంచాలని వారు తాపత్రపడుతున్నప్పటికీ అభిమానులు మాత్రం రాహాను ఒక్కసారైనా చూడాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. వారి ముచ్చట తీర్చేందుకు క్రిస్మస్ లంచ్ పురస్కరించుకుని రాహాను జనాల ముందుకు తీసుకురావాలని రాలియా జంట యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అదే నిజమైతే బంగారుతల్లి ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది అనడంలో సందేహమేలేదు.

Tags

Read MoreRead Less
Next Story