Ram Gopal Varma: బాలీవుడ్‌లో భారీ హారర్ చిత్రానికి వర్మ ప్లాన్.. హీరో ఎవరంటే..?

Ram Gopal Varma: బాలీవుడ్‌లో భారీ హారర్ చిత్రానికి వర్మ ప్లాన్.. హీరో ఎవరంటే..?
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. తెలుగులోనే కాదు హిందీలో కూడా పలు హారర్ చిత్రాలు తెరకెక్కించారు.

Ram Gopal Varma: హారర్ సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకానొక టైమ్‌లో హారర్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఆ తర్వాత క్రైమ్ జోనర్‌లోకి మారిపోయారు. ఇప్పుడు పూర్తిగా బోల్బ్ చిత్రాలతో బిజీ అయిపోయారు ఈ దర్శకుడు. ఇప్పుడు మరోసారి తాను హారర్ జోనర్‌ను టచ్ చేయనున్నారని, అది కూడా ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నారని ప్రకటించారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ.. తెలుగులోనే కాదు హిందీలో కూడా పలు హారర్ చిత్రాలు తెరకెక్కించారు. టాలీవుడ్‌లాగానే బాలీవుడ్‌లో కూడా సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన చివరి హిందీ చిత్రాన్ని తెరకెక్కించి ఇప్పటికి దాదాపు అయిదు సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన 'లడ్కీ ది డ్రాగన్ గర్ల్' మూవీ జులై 15న విడుదలకు సిద్ధమవ్వడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో రామ్ గోపాల్ వర్మ ఓ హారర్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ కథ గురించి వీరిద్దరు పలుమార్లు మాట్లాడుకున్నారని ఆర్జీవీ అన్నారు. అమితాబ్, వర్మ కాంబినేషన్‌లో ఇప్పటికి 6 సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలే. కాగా ఇప్పుడు మొదటిసారి వీరిద్దరు ఓ హారర్ మూవీ కోసం కలిసి పనిచేయనున్నారు.



Tags

Read MoreRead Less
Next Story