Rashi Khanna: హిందీలో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటోంది అందుకే...!
By - Chitralekha |16 March 2023 9:42 AM GMT
బాలీవుడ్ సక్సెస్ పై ఉబ్బితబ్బిబైపోతోన్న రాశీఖన్నా; అక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటోన్నట్లు వెల్లడి
మన అందాల రాశి ఫర్జీ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి బ్రేక్ అందుకుందనే చెప్పాలి. అందిపుచ్చుకున్న అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న రాశి ఇప్పుడు మరిన్ని ఆఫర్లు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఓ బాలీవుడ్ ఛానల్ తో ముచ్చటించిన రాశి ఇకపై మరిన్ని సినిమాలు ఇక్కడే చేయనున్నట్లు పేర్కొంది. హిందీ తన తెలిసిన భాష కాబట్టి, ఇక్కడే మరిన్ని ఆఫర్లు అందుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు. విజయ్ సేతుపతికి హిందీ కాస్త కొత్త కాబట్టి, అతడు కాస్త ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. అంతా బాగానే ఉంది కానీ, హందీలో నటిస్తూ అమ్మడు టాలీవుడ్ ను మరచిపోకపోతే చాలు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com