Top

స్టార్ హీరోలను వెనక్కి నెట్టి..

ఓ నటుడిగా ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేస్తే, అంతకంటే ఎక్కువగా కరోనా కష్టకాలంలో

స్టార్ హీరోలను వెనక్కి నెట్టి..
X

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు సోనూసూద్. ఏం చేస్తే అంత పేరు వస్తుంది. ఎన్ని సినిమాల్లో నటిస్తే ఆ నటుడిని అంతలా గుర్తు పెట్టుకుంటారు. ఓ నటుడిగా ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేస్తే, అంతకంటే ఎక్కువగా కరోనా కష్టకాలంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చి వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ అంతటితో తన పని అయిపోయిందనుకోలేదు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సోనూసూద్ పేరే పలవరించేలా నలుగురి నోళ్లలో నానుతున్నాడు..

తన సేవానిరతిని కొనసాగిస్తున్నాడు. ఇటీవల పంజాబ్ స్టేట్ ఐకాన్‌గానూ నియమితుడయ్యాడు. తాజాగా మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ ఫాలోయింగ్‌లో సోనూ బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో అత్యధిక ఫాలోయింగ్ (ట్విట్టర్) కలిగిన వ్యక్తుల జాబితాలో సోనూ సూద్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, సోనూ సూద్ ఉన్నారు.

Next Story

RELATED STORIES