Alia Bhatt: మొదటి సినిమాకు ఆలియా భట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Alia Bhatt: మొదటి సినిమాకు ఆలియా భట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
Alia Bhatt: మామూలుగా నటీనటులు ఎంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన వారు అయినా వారి తొలి రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది.

Alia Bhatt: మామూలుగా నటీనటులు ఎంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన వారు అయినా వారి తొలి రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా యాక్టర్లు వారి తొలి రెమ్యునరేషన్ గురించి చెప్పుకునే అనుభవాలు చాలా మధురంగా ఉంటాయి. ఇక ఇటీవల బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఆలియా భట్ కూడా తన తొలి రెమ్యునరేషన్ ఎంతో, దానితో ఏం చేసిందో బయటపెట్టింది.


19 ఏళ్ల వయసులోనే ప్రముఖ దర్శక నిర్మాత మహేశ్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో హీరోయిన్‌గా అడుగుపెట్టింది ఆలియా. తొలి చిత్రంతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మెల్లగా ఇండస్ట్రీలో తన స్టోరీ సెలక్షన్‌తో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకుంది.

ఆలియా భట్.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కోసం తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.15 లక్షలే అట. అంతే కాకుండా ఈ రెమ్యునరేషన్ చెక్‌ను తను తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టానని చెప్పుకొచ్చింది ఆలియా. అంతే కాకుండా ఆ రెమ్యునరేషన్‌తో తాను కారు కూడా కొనుగోలు చేసిందట. 22 ఏళ్లకే ఒక ఇంటిని కూడా కొన్నట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు తన ఆర్థిక విషయాలు ఏదీ పట్టించుకోని ఆలియా.. ఇప్పుడు తమ లైఫ్‌లోకి ఒక బిడ్డ వస్తుండడంతో ఇక ముందైనా అన్నీ చూసుకోవాలి అనుకుంటున్నట్టు చెప్పింది.



Tags

Read MoreRead Less
Next Story