2021 Yamaha : యమహో.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి 'యమహా'..

2021 Yamaha : యమహో.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి యమహా..
2021 యమహా ఎఫ్ జెడ్ సిరీస్ మోటార్ సైకిళ్లు బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందాయి.

బైక్ ప్రియులను ఆకర్షించే యమహా సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన 2021 ఎఫ్ జెడ్, ఎఫ్ జెడ్ఎస్ మోటార్ సైకిళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ రెండు మోడళ్లలను రెండు సరికొత్త కలర్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది. ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ మోడల్ మ్యాటీ రెడ్ కలర్, రేసింగ్ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు కాస్మటిక్ అప్డేట్లు ఉన్నాయి. 2021 ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ 3డీ యాంబ్లంతో లభ్యమవుతుంది.

ఫీచర్లు..

ఈ రెండు మోటార్ సైకిళ్లు సైడ్ అటెండ్ ఇంజన్ కట్ స్విచ్ ఆఫ్ స్టాండర్డ్ సేప్టీ ఫీచర్‌తో లభ్యమవుతుంది. బరువు కూడా రెండు కేజీలు తగ్గుతుంది. ఎఫ్‌జెడ్ఎస్ మోడల్లో బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఎస్ టెక్నాలజీని పొందుపరిచారు. ఇవి కాకుండా ఆన్సర్ బ్యాక్, లోకేట్ మై బైక్, ఈ లాక్ లాంటి తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

ఇంజన్..

2021 యమహా ఎఫ్ జెడ్ సిరీస్ మోటార్ సైకిళ్లు బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందాయి. 149 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉండి 7250 ఆర్పీఎం వద్ద 12.4 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 13.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5 స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది. భారత మార్కెట్లో యమహా ఎఫ్ జెడ్, ఎఫ్ జెడ్ ఎస్ మోటార్ సైకిళ్లకు పోటీగా సుజుకీ జిక్సెర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, కేటీఎం 125 డ్యూక్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 ఆర్ లాంటి బైక్స్ ఉన్నాయి.

ఎక్స్ షోరూంలో యమహా ఎఫ్ జెడ్-ఎఫ్ఐ మోడల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.03 లక్షలుగా నిర్దేశించింది. యమహా ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ ధర వచ్చేసి రూ.1.07 లక్షలుగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story