94 ఏళ్ల బామ్మ.. స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముతూ.. లక్షల్లో సంపాదన!

94 ఏళ్ల బామ్మ.. స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముతూ.. లక్షల్లో సంపాదన!
యంగర్ జనరేషన్ కు ఆదర్శమైన ఈ 94ఏళ్ల బామ్మ.. లక్షల్లో సంపాదిస్తోంది.

ఏదో చేయాలని కలలు కంటా.. కానీ అడుగు కూడా ముందుకు పడదు.. ఏమవుతుందో అని భయం.. సక్సెస్ అవుతామో లేదో అన్న ఆందోళన. అందుకే ఒంట్లో సత్తా.. చేతిలో మొత్తం ఉన్నా కూడా భయంతో వ్యాపారం అంటే భయపడుతుంటారు. అలాంటి వాళ్లకు పాఠంగా మారారు 94ఏళ్ల బామ్మ. వయసుతో పనేంటి.. స్టార్టప్ పెట్టడానికి అని నిరూపించారు.. విజయం సాధించారు. ఈ వయసులో ఎందుకీ సాహసాలుఅన్నారు. అయినా వెనకడుగు వేయలేదు.

హర్భజన్ కౌర్ అనే 94 సంవత్సరాలు వయసులో ముని మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. కానీ నాలుగేళ్ల కిందట హర్భజన్ పేరు మీదే స్టార్టప్ ప్రారంభించారు. ఈ బ్రాండ్ పేరుతో ఆమె ఐస్, పచ్చళ్లు అమ్మడం ప్రారంభించారు.

ఓ స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్మడం ప్రారంభించారు. 2వేలు ఆదాయం వచ్చిందట. ఆ ఆనందంతో మరింతగా వ్యాపారాన్ని విస్తరించారు. పచ్చళ్లు చేయడం ప్రారంభించారు. అవి అదిరే టేస్ట్ ఉండటంతో... చాలా మంది వాటిని మళ్లీ మళ్లీ కొనడం ప్రారంభించారు. మార్కెట్‌లో బ్రాండెడ్ పచ్చళ్ల కంటే తక్కువ ధరకే ఆమె అమ్మడంతో... వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు ఆమె స్వీట్లు కూడా అమ్ముతున్నారు. ఛండీగఢ్‌లో హర్భజన్ ఓ బ్రాండెడ్ కంపెనీగా మారిపోయింది. యంగర్ జనరేషన్ కు ఆదర్శమైన ఈ 94ఏళ్ల బామ్మ.. స్టార్టప్ తో లక్షల్లో సంపాదిస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందించారు. ఈ సంవత్సరపు పారిశ్రామిక వేత్త అని ట్విట్టర్‌లో అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story