జియోకు షాకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్‌కు బ్రేకింగ్ న్యూస్

జియోకు షాకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్‌కు బ్రేకింగ్ న్యూస్
ఎయిర్ టెల్ కు యూజర్లు మొగ్గుచూపడం పట్ల రిలయన్స్ ను భయపెడుతోంది.

డిజిటల్ టెలి కమ్యూనికేషన్ రంగంలో తిరుగులేని భావిస్తున్న రిలయన్స్ జియోకు షాకిచ్చారు చందాదారులు. ఎయిర్‌టెల్‌ ఖాతాలో జనవరిలో కొత్తగా 69 లక్షల యాక్టివ్‌ యూజర్లు చేరారు. డిసెంబరుతో పోలిస్తే రిలయన్స్‌ జియో యాక్టివ్‌ చందాదారులు 34 లక్షల మంది తగ్గినట్టు ట్రాయ్‌ లెక్కలున్నాయి.

మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ నివేదిక ప్రకారం యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారన్నది దీని ద్వారా తెలుస్తుంది. మొత్తం యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి ఎయిర్‌టెల్‌కు 33.6 కోట్లు, జియోకు 32.5 కోట్లకు చేరింది.

భారత్‌లో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతున్న జియో మొత్తం చందాదార్ల సంఖ్య 41.07 కోట్లు కాగా, రెండవ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌కు 34.46 కోట్లు ఉన్నారు. రిలయన్స్ జియో కంటే మూడు రెట్లు ఎక్కువ చందాదారులను సాధించడం ఎయిర్ టెల్ కు రావడం విశేషం. 2020 ఆగస్టు నుండి 2021 జనవరి మధ్య దాదాపు 25 మిలియన్ల యూజర్లు ఎయిర్‌టెల్‌ సాధించింది.

జియో కేవలం 10 మిలియన్లను పరిమితం అయింది. యాక్టీవ్ యూజర్స్ విషయంలో కూడా 97 శాతం ఎయిర్ టెల్ కు ఉంటే.. జియోకు కేవలం 79శాతం మాత్రమే. ప్రీమియం కావొచ్చు.. క్వాలిటీ సర్వీస్ కావచ్చు.. ఎయిర్ టెల్ కు యూజర్లు మొగ్గుచూపడం పట్ల రిలయన్స్ ను భయపెడుతోంది.

Also Read : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story