అమెజాన్ కోసం వాటిని పక్కనపెట్టిన అంబానీ

అమెజాన్ కోసం వాటిని పక్కనపెట్టిన అంబానీ

రిలయన్స్ జియో తర్వాత దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లను భారీగా ఆకర్శిస్తోంది రిలయన్స్ రిటైల్. ఇప్పటికే సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు వెచ్చించి 1.75శాతం వాటా తీసుకుంది. కార్లీల్, సాఫ్ట్ బ్యాంక్, అబుదాబీ సహా జెయిట్ ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. అయితే ముఖేష్ అంబానీ మాత్రం వాటిని వెయిటింగ్ లిస్టులో పెట్టినట్టు తెలుస్తోంది. జియోలో దాదాపు రూ.లక్షా 50వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో పెట్టిన కంపెనీలన్నీ మళ్లీ రిటైల్ విభాగంలోనూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే సిల్వర్ లేక్ మినహా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంబానీ. అబుదాబీ కూడా 750 మిలియన్ డాలర్లు పెట్టడానికి సిద్ధమైంది. వాస్తవానికి రిటైల్ లో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కు 10శాతం స్టేక్ అమ్మాలని ముందుగా భావించారు. దీనివల్ల కంపెనీకి 5.7 బిలియన్ డాలర్లు అంటే 40వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ కంపెనీ అనూహ్యంగా వ్యూహం మార్చింది.

అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ దిగ్గజం అమెజాన్ కు మెజార్టీ వాటా విక్రయించేందుకు సిద్దమైనట్టు ప్రచారం జరుగుతోంది. 40శాతం వాటా పై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రిలయన్స్ కంపెనీకి లక్షా 50వేల కోట్లు వస్తాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ స్టేక్ సేల్ అవుతుంది. ఓరకంగా ఇది జాక్ పాట్. అందుకే ఫైనాన్సియల్ ఇన్వెస్టర్స్ ను పక్కనపెట్టి.. వ్యూహాత్మక భాగస్వామ్యంపై ద్రుష్టిపెట్టింది రిలయన్స్. అమోజాన్ తో డీల్ ఓకే అయితే.. మిగతావారికి పక్కనపెడతారు.

Tags

Read MoreRead Less
Next Story