Anand Mahindra: టాటా కార్లపై ఆనంద్ మహింద్రా కామెంట్స్.. ఏమన్నారంటే..?

Anand Mahindra: టాటా కార్లపై ఆనంద్ మహింద్రా కామెంట్స్..  ఏమన్నారంటే..?
Anand Mahindra: టాటా కార్ల గురించి ఆనంద్ మహింద్రా కామెంట్స్ చేశారు. ఆనంద్ మహింద్రా ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దేశంలో చాలా ఆటోమెబైల్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో టాటా మోటార్స్, మహింద్రా వాహనాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక వాటి మధ్య ఉన్న పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే రెండు కంపెనీలూ తమ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్ లోకి తెస్తుంటాయి. అయితే ఇక్కడే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్ర నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహింద్రా తన ప్రత్యర్థి కంపెనీ గురించి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ఆనంద్ మహింద్రా ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ ట్విటర్‌ యూజర్‌.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి పొగడ్తలు చేస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. దానికి ఆనంద్‌ మహీంద్రా బదులు కూడా ఇచ్చారు. అయితే.. ఆ సంభాషణకు కొనసాగింపుగా మరో యూజర్, సర్‌.. టాటా కార్ల మీద మీ ఫీలింగ్‌ ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి ఆయన అంతే పాజిటివ్‌గా స్పందించారు.

టాటా మోటార్స్‌ వంటి బలమైన పోటీదారులు ఉండడం తమకు ఎంతో ప్రత్యేకమని బదులిచ్చారు. టాటా మోటార్స్ వారు తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్మించుకుంటూ ఉంటారని.. వాళ్ల ప్రయత్నం మనల్ని మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రేరేపిస్తుందన్నారు. పోటీతత్వం అనేది ఎప్పుడూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది అని ఆనంద్ మహింద్రా రిప్లై ఇచ్చారు. తన ప్రత్యర్థి కంపెనీపై ఆనంద్ మహింద్రా ఇచ్చిన కూల్ రిప్లైకి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story