ఆన్ లైన్ యాపిల్ స్టోర్ .. బంపర్ ఆఫర్లు

ఆన్ లైన్ యాపిల్ స్టోర్ .. బంపర్ ఆఫర్లు
6శాతం వరకూ క్యాష్‌బ్యాక్.. గరిష్టంగా 10,000 రూపాయలుగా ఉంది.

యాపిల్ ఇండియాలో తొలి ఆన్‌లైన్ స్టోర్ ను ప్రారంభించింది. డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ తో పాటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. HDFC బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. కొన్ని మోడల్స్ పై 6శాతం వరకూ క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. గరిష్టంగా 10,000 రూపాయలుగా ఉంది. క్యాష్‌బ్యాక్ మినిమం 21వేలు పర్చేజ్ చేయాలి. నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జె అండ్ కె బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఆరు నెలల కాలానికి నో-కాస్ట్ EMI ఆఫర్ ఉంది. ఎక్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్రాండ్, మోడల్, కండిషన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఆన్‌లైన్ ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను సర్దుబాటుతో కొత్త ఐఫోన్ ధరను తగ్గిస్తుంది. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మాక్, వాచ్, యాపిల్ టీవీలతోపాటు, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ ఎక్స్‌ఆర్ తదితరాలను కొనుగోలు చేయవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story