సరికొత్త ఫీచర్లతో బజాజ్ సిటీ 100 కడాక్ వెర్షన్..

ద్విచక్ర వాహనదారుల మనసు దోచుకున్న బజాజ్ సిటీ 100 బైక్ సరికొత్త మోడల్‌తో మార్కెట్లో అడుగుపెట్టింది. అదే బజాజ్ సిటీ 100 కడాక్ వెర్షన్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ.46,432గా సంస్థ నిర్ధేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. ఫీచర్ల విషయానికి వస్తే స్టెబిలిటీ కోసం క్రాస్ ట్యూబ్ హ్యాండిల్ బార్, రబ్బర్ ట్యాంక్ ప్యాడ్లు, పిలియన్ల కోసం గ్రాబ్ రెయిల్స్, ఇండికేటర్ల కోసం ప్లెక్సిబుల్ క్లియర్ లెన్స్, ఎక్సటెండెడ్ మిర్రర్ బూట్, ఫోర్స్ సస్పెన్షన్లు, అదనపు సౌకర్యం కోసం ఫ్లాటర్ సీటు, ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్ లాంటివి ఇందులో అమర్చారు.
మూడు కలర్ ఆప్షన్లు.. గ్లోసీ ఎబోని బ్లాక్‌తో కూడిన బ్లూ డెకల్స్, మ్యాటీ ఆలివ్ గ్రీన్‌తో కూడిన యెల్లో డెకల్స్, గ్లాస్ ఫ్లేమ్ రెడ్ తో కూడిని బైట్ రెడ్ డెకల్స్ కలర్స్ లో ఇది లభ్యమవుతుంది. ఈ సరికొత్త కడాక్ వర్షన్ 102 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్సీఎం వద్ద 7.5 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 వద్ద 8.34 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంద. అంతే కాకుండా 4-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఇది పని చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com