కోవిడ్ చికిత్సకు బ్యాంక్ లోన్.. రూ. 5 లక్షల వరకు..

కోవిడ్ చికిత్సకు బ్యాంక్ లోన్.. రూ. 5 లక్షల వరకు..
చికిత్స పేరుతో లక్షల బిల్లులు చేతిలో పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్ కుటుంబాలను ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయి.

Bank Loan: కోవిడ్ మహమ్మారి పేరుతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితుల కుటుంబసభ్యుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. కొన్ని జబ్బులు డబ్బున్న మారాజులకే వస్తాయంటారు. కానీ కోవిడ్ ఎవరినీ వదిలిపెట్టట్లేదు. అందర్నీ చుట్టబెట్టేస్తుంది. పేదవాడికి వస్తే ప్రభుత్వ దవాఖానకి, మధ్యతరగతి వాడికి, ఉన్నవాడికి వస్తే అందుబాటులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి పరిగెడుతున్నారు. చికిత్స పేరుతో లక్షల బిల్లులు చేతిలో పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్ కుటుంబాలను ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. కోవిడ్ లోన్ అందించేందుకు సిద్ధపడ్డాయి.

Covid చికిత్స కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు స్టేట్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటన ద్వారా లోన్ ఇస్తున్న విషయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ మార్గదర్శకాల ప్రకారం కొత్తగా సృష్టించిన కోవిడ్ లోన్ పుస్తకంలో భాగంగా, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసిజిఎల్ఎస్) కింద వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి బ్యాంకులు ఆరోగ్య సంరక్షణ వ్యాపార రుణాలను కూడా అందిస్తాయి. 7.5 శాతం చొప్పున 2 కోట్ల రూపాయల వరకు రుణాలు ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అందించనున్నట్లు ఐబిఎ, ఎస్‌బిఐ తెలిపింది.

ఇక వ్యక్తిగత రుణాలు రూ.25,000 గరిష్టంగా రూ.5 లక్షల వరకూ బ్యాంకులు అందిస్తున్నాయి. సాధారణ వ్యక్తిగత రుణాలు అయితే 12 నుంచి 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. కానీ కోవిడ్ లోన్ తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్బీఐ, యూబీఐ లాంటి బ్యాంకులు 8.5 శాతం వడ్డీకి కోవిడ్ రుణాలు అందిస్తున్నాయి. రుణ వ్యవధి ఐదేళ్ల కాలపరిమితి. అయితే ఆయా బ్యాంకుల్లో వేతనం, పింఛను ఖాతా ఉన్న వారికే బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే రుణం తీసుకుని ఉన్నా కూడా కోవిడ్ రుణం పొందడానికి అర్హులే. ఐటీ రిటర్న్స్ సబ్ మిట్ చేస్తున్నవారికీ అప్పు ఇస్తామంటున్నాయి బ్యాంకులు.

Tags

Read MoreRead Less
Next Story