వీళ్ళు లుక్కేస్తే.. స్టార్టప్ లకి మహాదశే.. !

వీళ్ళు లుక్కేస్తే.. స్టార్టప్ లకి మహాదశే.. !
ఎవరైనా సరే వ్యాపారం మొదలుపెట్టి కాస్త లాభాల్లోకి వచ్చి గుర్తింపు వస్తే చాలు బడా కంపెనీలు మీద పడతాయి.

ఈ పెద్దోళ్లున్నారో... చిన్నోళ్లనే బతకనియ్యరా...

వరుస టేకోర్లు.. చిన్న కంపెనీలపై కళ్లు

సినిమాలో డైలాగే అయినా కార్పొరేట్ ప్రపంచంలో ఇది బాగా పాపులర్ అయింది. ఎవరైనా సరే వ్యాపారం మొదలుపెట్టి కాస్త లాభాల్లోకి వచ్చి గుర్తింపు వస్తే చాలు బడా కంపెనీలు మీద పడతాయి. ఆపర్లతో వచ్చి వాలతాయి. నీ రేటెంత.. నీ కంపెనీ ఎంతకిస్తావ్ అంటూ బేరాలు పెడతారు. అవి చూస్తే ఫ్యాన్సీ ఆఫర్లు.. ఇంకా కంపెనీ పెంచాలని ఆలోచనలు ఉన్నా.. వచ్చిన కాడికి చాలని అమ్మేస్తుంటారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు దేశంలో అతిపెద్ద వ్యాపారవేత్తలు ఎవరో తెలుసుగా.. అదానీ, అంబానీ, టాటా, ఆదిత్యా బిర్లా, వేదంతా వీరంతా ఇప్పుడు కంపెనీల వేటలోఉన్నారు.. కొన్ని చేజిక్కించుకున్నారు.. మరికొన్ని సంస్థలతో చర్చలు సాగుతున్నాయి ఇంతకీ ఎవరు ఏ కంపెనీలపై కన్నేశారో చూద్దాం...

టాటాలు...

వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటాలు కూడా సొంత బ్రాండ్ లు పెంచుకుంటూనే.. మార్కెట్లో సక్సెస్ అయిన చిన్న కంపెనీలను తనలో కలుపుకుంటోంది. ఇందులో ఇప్పటికే BigBasket చేరింది. ప్రస్తుతం Just Dialతో చర్చలు జరుపుతోంది. JD mart కూడా ఇందులో భాగమే. ఇక ఎయిర్ ఇండియా కంపెనీని కూడా తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది. ఇక ఫార్మా రంగంలో 1Mg ని కూడా 100 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది.

రిలయన్స్....

ఈ కంపెనీ టేకొవర్లలో తనకు తానే సాటి అనిపించుకుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ Skytran సొంతం చేసుకుంది. కలారికేపిటల్ లో పెట్టుబడి పెట్టింది. ఎడ్ టెక్ Embibe కొన్నది. ఇక లింజరీ రిటైల్ కంపెనీ Zivame సొంతమైంది. అర్బన్ లాడర్ కొన్నది. Netmeds ఈ కంపెనీ చేతికి చిక్కింది. రిటైల్ కింగ్ అయిన ఫ్యూచర్ గ్రూపే దీని సొంతమైంది.

ఆదిత్యా బిర్లా...

ఈ కంపెనీ కూడా తక్కువేమీ తినలేదు. అపెరల్ విభాగంలో బ్రాండ్స్ అయిన Sabyasachi Tarun Tahilianiలతో ఒప్పందం చేసుకుంది. కీలక వాటాలు దక్కించుకుంది. Shantanu and Nikhil తోనూ ఒప్పందాలు చేసుకుంది.

అదానీకి తిరుగులేదు...

ఈ మధ్య తెగవార్తల్లో ఉంటున్నారు. ఎక్కడ పోర్టు వదలడం లేదు. ఎయిర్ పోర్టు అంతకన్నా వదలడం లేదు. అందినకాడికి కొంటున్నారు. క్రిష్ణపట్నం పోర్టు కొన్నారు. గంగవరం పోర్టులో సగం సొంతం చేసుకున్నారు. కల్పతరు పవర్ ట్రాన్సిమిషన్ కూడా కొన్నారు. ముంబై ఎయిర్ పోర్టులో కీలక వాటాలు దక్కించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story