మళ్లీ ఎగిసిపడుతోన్న బిట్ కాయన్

మళ్లీ ఎగిసిపడుతోన్న బిట్ కాయన్
సంచనాలకు కేరాఫ్ అయిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయన్ చుక్కలు చూపిస్తోంది.

సంచనాలకు కేరాఫ్ అయిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయన్ చుక్కలు చూపిస్తోంది. గడిచిన నెలలో ఏకంగా 58వేల డాలర్లను టచ్ చేసిన ఈ కరెన్సీ ఇంకా పెరుగుతుందని అంచనాల మధ్య షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఇన్వెస్టర్లు భారీగా కొన్నారు. రెండు వారాల్లోనే తిరగబడింది. ఫిబ్రవరి 28 నాటికి 15వేల డాలర్లు పడిపోయి.. 43500 డాలర్లకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబోమన్నారు. దీంతో చాలామంది ఎగ్జిట్ అయ్యారు. అయితే అనూహ్యంగా మళ్లీ పెరుగుతోంది. రెండు వారాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం ఇది 54వేల డాలర్లను దాటింది. అయితే ఇది కూడా కంటిన్యూ అవుతుంది.. మళ్లీ డౌన్ ఫాల్ ఉంటుందా అన్నభయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story