బ్యాంకులు అమ్మేయడం బ్లండర్ అంటోన్న రాజన్

బ్యాంకులు అమ్మేయడం బ్లండర్ అంటోన్న రాజన్
ఎలా పడితే అలా, మార్పులు చేసుకుంటూ పోతే ఆ తర్వాత అది అంతిమంగా దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది రఘురాంరాజన్ వాదన

ప్రభుత్వం తారకమంత్రం ప్రవేటైజేషన్, ఐతే ఇది ఆర్బీఐ మాజీ గవర్నర్‌కి మాత్రం పెద్ద తప్పిదంగా, ప్రత్యేకించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విషయంలో కేంద్రం చారిత్రక తప్పిదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌కి నిరసనగానే బ్యాంకులు రెండు రోజుల స్ట్రైక్‌కి పిలుపు ఇచ్చాయ్. వాటి పిలుపు రఘురాంరాజన్‌కి బాగానే అందినట్లుంది. అందుకే బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ అనేది చాలా తప్పంటూ చెప్పుకొచ్చారు.

అసలు ప్రవేటీకరణ చేస్తే, లాభాల బాటన పడతాయనే నమ్మకం ఏంటని నిలదీస్తున్నారాయన. కార్పోరేట్లు కోరి కోరి ఇలాంటి నష్టాల్లో ఉన్న బ్యాంకులను ఎందుకు కొంటాయని..ఇక్కడే అసలు మెలిక ఉందన్నారు రఘురాంరాజన్. అంతేకాదు, మానిటరీ పాలసీ చట్రాన్నే మార్చడం బాండ్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.

ఇప్పుడున్న వ్యవస్థతోనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, వృద్ధిని మెరుగుపరచడం సాధ్యపడిందని గుర్తు చేశారు. ఎలా పడితే అలా, మార్పులు చేసుకుంటూ పోతే ఆ తర్వాత అది అంతిమంగా దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది రఘురాంరాజన్ వాదన. ఫైనాన్షియల్‌గా మాత్రమే కాదు, పొలిటికల్‌గా కూడా బ్యాంకుల విక్రయం అనేది సరైన వ్యూహం కాదని ఎన్డీఏ ప్రభుత్వానికి సూచించారు.

Also Read : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story