బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్..

బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్..
ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అధునాతన కార్లు, బైక్ లు తీసుకు వచ్చి వాహన ప్రియుల మనసును దోచుకుంటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది.

ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అధునాతన కార్లు, బైక్ లు తీసుకు వచ్చి వాహన ప్రియుల మనసును దోచుకుంటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను సంస్థ ఆవిష్కరించింది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న డెఫినిషన్ సీఈ 04 స్కూటర్లను త్వరలోనే భారీ సంఖ్యలో బీఎండబ్ల్యు ఉత్పత్తి చేయనుంది. టెస్టింగ్ కోసం రోడ్ పై దూసుకుపోతున్న ఈ బైక్ ని కెమేరాలు క్లిక్ మనిపించాయి. ఈ స్కూటర్ స్పోర్ట్స్ లుక్ తో అదిరిపోయేలా ఉందని అంటున్నారు చూసిన వారు.

యూత్ కు నచ్చేలా ఈ స్కూటర్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతానికి ప్రొడక్షన్ వివరాలేవి ఈ ప్రముఖ జర్మనీ సంస్థ బయటకు వెల్లడించలేదు. ఈ మోడల్ లో ఇంటిగ్రేడెడ్ ఎల్ ఈడీలతో వీషేప్ హెడ్ ల్యాంప్ ఉంది. ముందు భాగం మధ్యలో హెడ్ ల్యాంప్ ఉంది.

దాంతో పాటు 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఈ స్కూటర్ కు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మరిన్ని ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో మార్కెట్లోకి వచ్చే ఈ స్కూటర్ గురించి యువత ఎదురు చూస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story