Twitter-Tesla: మస్క్ ఫోకస్ దెబ్బతీసిన ట్విట్టర్..!!

Twitter-Tesla: మస్క్ ఫోకస్ దెబ్బతీసిన ట్విట్టర్..!!

ట్విట్టర్(Twitter) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) విధానాలు టెస్లా కార్ల కంపెనీకి నష్టాలు తెస్తాయా..? అతను టెస్లాపై మరింతగా దృష్టి సారించాలా..? అంటే కచ్చితంగా అవును అనే అంటున్నారు కంపెనీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లు, సిబ్బంది.

ఈవీ(EV) మార్కెట్లు పుంజుకుంటున్న ఈ తరుణంలో ఎలన్ మస్క్ ట్విట్టర్, స్పేస్ ట్రావెల్, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)వంటి ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతూ టెస్లా(Tesla)పై ఫోకస్ పోయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ లైవ్ పల్స్ సర్వే నిర్వహించిన సర్వేలో మొత్తం 630ని సర్వే చేయగా 54 శాతం మంది ఈవీ రంగంలో కాంపిటీషన్ పెరిగడం వల్ల కంపెనీకి రిస్క్ పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేయగా, 26 శాతం మందికి ఎలన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తనపై షేర్ హోల్డర్లకు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత సంవత్సరం టెస్లాలో కొన్ని షేర్లని అమ్మి, ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన మస్క్ దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే సర్వేలో పాల్గొన్న వారు మాత్రం ట్విట్టర్‌ కొనుగోలు వెచ్చించిన విలువ మస్క్ చెల్లించదాని కంటే తక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


63 శాతం మంది కార్ల ధరలను తగ్గించి, ఎక్కువ సంఖ్యలో కార్ల విక్రయాలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే తగ్గించిన కార్ల ధరల నిర్ణయ ప్రభావం ఎలా ఉండనుందో బుధవారం వెల్లడించనున్న 2వ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడికానుంది. సగటు లాభాల అంచనాల్ని 23 శాతానికి తగ్గించారు.

"ఎలన్ మస్క్‌ని ఎవరూ అంచనా వేయలేరు. ఎవరికీ అర్థం కాడు. అదే టెస్లా కంపెనీకి అతి పెద్ద రిస్క్" అని టట్టల్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఈవో మాథ్యూ వెల్లడించాడు.

ఇప్పటికీ ఈవీ మార్కెట్‌లో టెస్లాదే ఆధిపత్యం. అయితే భవిష్యత్తులో కూడా మన కంపెనీదే ఆధిపత్యం ఉంటుందనే అంచనాలతోనే మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. గత నెలలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ రెండవ త్రైమాసికంలో 3,52,163 ఎలక్ట్రిక్ వాహనాలతో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు చేసింది. ఇదే కాలంలో టెస్లా ప్రపంచవ్యాప్తంగా 4,66,140 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించింది. ఫోర్డ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పడిపోవడంతో టెస్లాకి రికార్డ్ స్థాయి బుకింగ్స్ వచ్చాయి.



అమెరికా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం తెస్తే అది ఇతర కారు తయారీదారులకు లాభదాయకం కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో టెస్లా ప్రత్యర్థులు ఈ రంగంలో టెస్లా ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం 100 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో రానుండటంతో టెస్లాకి ఉన్న మెజార్టీ వాటా తగ్గవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story