కోర్టుకు వెళతా.. మేల్ డామినేషన్ పై గళమెత్తిన వల్లీ

కోర్టుకు వెళతా.. మేల్ డామినేషన్ పై గళమెత్తిన వల్లీ
ఫ్యామిలీ ఫైట్ అనేకంటే కూడా ఇంట్లో మేల్ వర్సెస్ ఫిమేల్ వార్ అనొచ్చు.

తమిళనాడుకు చెందిన మురగప్ప సంస్థకు 120 ఏళ్ల చరిత్ర ఉంది. డజన్ల కొద్దీ కంపెనీలు.. 9 లిస్టెడ్ కంపెనీలున్నాయి. హిందు అవిబాజ్య సంస్థలో కుటుంబపోరు మొదలైంది. ఫ్యామిలీ ఫైట్ అనేకంటే కూడా ఇంట్లో మేల్ వర్సెస్ ఫిమేల్ వార్ అనొచ్చు. కంపెనీ హోల్డింగ్ కంపెనీ అంబాడీ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ హోదా కోసం ఫైట్ చేశారు వల్లీ అరుణాచలం. మురగప్ప గ్రూపు ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ దివంగత మురగప్పన్ కుమార్తె ఆమె. అయితే మేల్ డామినేటెడ్ బోర్డు సభ్యులు 91.36శాతం ఓట్లతో రిజక్ట్ చేశారు. దీంతో అరుణాచలం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తిగా పురుషాధిక్య బోర్డుగా మారిందని.. మహిళలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అంతా బంధువులే ఉండి కూడా మహిళల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు వల్లీ అరుణాచలం. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో సైంటిస్టుగా ఉన్నారు. అంబాడీ హోల్డింగ్ లో వల్లీ అరుణాచలం, ఆమె సోదరి వెల్లాచి, తల్లి వల్లీమరుగప్పన్ లకు 8.15శాతం స్టేక్ వారసత్వంగా వచ్చింది. మరి కుటుంబపోరు ఎక్కడిదాకా వెళ్లతుందో చూడాలి. లిస్టెడ్ కంపెనీలు 9 ఉన్నాయి. ఖచ్చితంగాకుటుంబం వీధికెక్కితే వాటిపై ప్రభావం చూపుతుంది.

Tags

Read MoreRead Less
Next Story