గుడ్ న్యూస్ : తగ్గనున్న బంగారం, వెండి ధరలు

గుడ్ న్యూస్ : తగ్గనున్న బంగారం, వెండి ధరలు
గోల్డ్, సిల్వర్ వినియోగదారులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని బడ్జెట్‌లో భారీగా తగ్గించారు.

గోల్డ్, సిల్వర్ వినియోగదారులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని బడ్జెట్‌లో భారీగా తగ్గించారు. పసిడి, వెండి ధరలను పూర్వస్థితికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019 జూలైలో బంగారంపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచారు. జీఎస్టీ కలుపుకుంటే అది 15.5 శాతానికి చేరుతోంది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. అయితే ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.

కేంద్రం తీరు ఎలా ఉందంటే ఒక చేతితో పెట్టి మరో చేతితో లాక్కునేలా ఉంది. ఎందుకంటే ఒకవైపు కస్టమ్స్ డ్యూటీని 5 శాతం తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ వీటికి కూడా గండికొట్టింది. ఎందుకంటే వీటిపై అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ను 2.5 శాతం విధిస్తోంది. దీనివల్ల పసిడి, వెండి ధరలు కొంత వరకు మాత్రమే తగ్గుతాయంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story