ఆ ఉద్యోగులపై షేర్ల వర్షం కురుస్తోంది తెలుసా..

ఆ ఉద్యోగులపై షేర్ల వర్షం కురుస్తోంది తెలుసా..
ఎంప్లాయిస్ ఒకప్పటిలా లేరు. కంపెనీలో పనిచేయడంతో పాటు.. షేర్లు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు.

పనిచేశామా.. జీతం వచ్చిందా... వెళ్లామా అన్నట్టుగా లేరు ఉద్యోగులు.. అవును ఎంప్లాయిస్ అంటే ఒకప్పటిలా లేరు. కంపెనీలో పనిచేయడంతో పాటు.. షేర్లు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు కూడా వాళ్లకు షేర్లు డిస్కౌంట్ లో ఇవ్వడం ద్వారా వారిలో కంపెనీ పట్ల లయబులిటీ పెంచుతున్నాయి.

గతకొంతకాలంగా ఇండియాలో ఈ ట్రెండ్ అధికంగా కనిపిస్తోంది. కంపెనీల్లో ఉద్యోగులకు షేర్లు కేటాయింపు సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు ఇది అమెరికా, యూకే, యూరోప్ వంటి దేశాల్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇందుకు భిన్నంగా మనదేశంలో కూడా ఉద్యోగులకు కంపెనీలు షేర్లు కేటాయిస్తున్నాయి. గత ఏడాది దేశంలో దాదాపు 30 కంపెనీలు ఐపీఓ కు వచ్చాయి. సుమారు 31వేల కోట్లు సమీకరించాయి.

ఇందులో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు రూ.15-30 రూపాయల వరకు డిస్కౌంట్ తో ఇచ్చాయి. ప్రత్యేకంగా కొన్ని షేర్లు పక్కన పెట్టి ఉద్యోగులకు వారి వారి అర్హతలకు అనుగుణంగా కేటాయిస్తున్నారు. ఇది అన్ని రకాలుగా మంచిదే అంటున్నారు. కంపెనీ పట్ల ఉద్యోగుల్లో మనది అనే భావన పెరుగుతుంది. కంపెనీ భాగుంటే షేర్లు భాగుంటాయనే ఉద్దేశంతో పనితీరులో మార్పు వస్తుంది. అటు కంపెనీలకు కూడా మేలు చేస్తుంది.

బాధ్యతాయుతంగా ఉద్యోగులు ఉండటంతో పాటు... కంపెనీలో కీలక వ్యక్తులు జాబ్స్ మారకుండా ఉండేలా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకప్పుడు కేవలం కంపెనీ లో ఉన్నతస్థాయి వ్యక్తులకు మాత్రమే జాబ్ లో చేరే సందర్భంలో షేర్ల అలాట్ మెంట్ ఉండేది.. కానీ ఇప్పుడు ఉద్యోగులు కూడా షేర్లు తీసుకునే వెసులుబాటు కంపెనీలు ఇస్తున్నాయి.

మరోవైపు ఉద్యోగులకు షేర్ల కేటాయింపు ద్వారా మార్కెట్లోకి కొత్తగా ఖాతాదారులు వస్తుంటారు. డీ మ్యాట్ ఖాతాలు పెరుగుతున్నాయి. మార్కెట్ పార్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది SBI కార్డ్స్ IPOలో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల వాటాలో కూడా 3.24 రెట్లు సబ్ స్కైబ్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story