Foxxcon:భారత్‌లో 1.5లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన ఫాక్స్‌కాన్

Foxxcon:భారత్‌లో 1.5లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన ఫాక్స్‌కాన్

తైవాన్‌కు చెందిన సెమీకండక్టర్ల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత సెమీకండక్టర్ తయారీ మార్కెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లుంది ప్రకటించింది. సెమీ కండక్టర్లను దేశీయంగా తయారుచేయాలన్న భారత ప్రణాళిలకు ఇది ఎదురుదెబ్బే. గత సంవత్సరం దేశంలో సెమీ కండక్టర్లు, చిప్‌లు తయారుచేయడానికి మైనింగ్ దిగ్గజం వేదాంతాతో కలిసి సుమారు 19.5 బిలియన్ డాలర్ల ప్రణాళికతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో వేదాంతా 67 శాతంతో మెజారిటీ వాటా కలిగి ఉంది. గుజరాత్‌లోని ధోలేరాలో ప్లాంట్ ఏర్పాటు చేసి అందులో సెమీకండక్లర్లు ఉత్పత్తి చేయాలనుకున్నారు. అయితే ఈ పరిణామానానికి కారణాలు ఎవరూ వెల్లడించలేదు. ఫాక్స్‌కాన్ ప్రపంచంలో సెమీకండక్టర్ల తయారీలో అతిపెద్ద సంస్థ.


"విభిన్న అవకాశాలు వెతుక్కోవాలనే ఇరు వర్గాల ప్రణాళిక ప్రకారం వేదాంతతో ఉన్న జాయింట్ వెంచర్‌ నుంచి తొలగాలని నిర్ణయించాము. ఇకపై ఈ వెంచర్‌లో కొనసాగబోము " అని ఫాక్స్‌కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

వేదాంత వర్గాలు మాట్లాడుతూ... ఈ జాయింట్ వెంచర్‌ కొనసాగుతుంది. కేవలం భాగస్వామి మాత్రమే వైదొలిగాడు. ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి ఈ రంగంలోని ఇతర కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం. 40nm ఉత్పత్తులు తయారుచేయడానికి అవసరమైన గ్రేడ్ సాంకేతిక మాకు అందుబాటులో ఉందని వివరించారు.


గత సంవత్సరం ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. ఫాక్స్‌కాన్ వైదొలగడంతో వేదాంత షేర్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

➡️This decision of Foxconn to withdraw from its JV wth Vedanta has no impact on India's #Semiconductor Fab goals. None.

➡️Both Foxconn n Vedanta have significant investments in India and are valued investors who are creating jobs n growth.

➡️It was well known that both… https://t.co/0DQrwXeCIr

భారత శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఫాక్స్‌కాన్ వైదొలగడం, మన దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి చేయాలనే మన లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపదు అన్నారు. ఇరు కంపెనీలు మన దేశంలో చాలా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు ఎవరితో జతకట్టాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వం పని కాదని అన్నాడు.


Tags

Read MoreRead Less
Next Story