అంబానీ, బెజోస్‌కి షాక్.. బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్ అదానీనే..!

అంబానీ, బెజోస్‌కి షాక్.. బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్ అదానీనే..!
ప్రపంచంలో కుబేరులంటే ఖచ్చితంగా భారతీయుల పేర్లు లేకుండా జాబితా విడుదల కాదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతులంటే..ఎవరో మనకి సరీగా నోర్లు కూడా తిరగని పేర్లు చెప్పేవాళ్లు. అందులో మనోళ్ల పేర్లు ఉండటం కాదు కదా.. ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు. కానీ గత 20ఏళ్లలో ఆ పరిస్థితి క్రమంగా మారింది. ఇక లాస్ట్ టెన్ ఇయర్స్‌లోనైతే సీన్ పూర్తిగా మారిపోయింది.ఇండియాలో కూడా రిచ్చెస్ట్ పర్సనాలిటీలు భారీగానే ఉన్నారని ప్రపంచానికే కాదు మనకి కూడా బాగా తెలిసి వచ్చింది. ఇక గత రెండేళ్లలోఅయితే ప్రపంచంలో కుబేరులంటే ఖచ్చితంగా భారతీయుల పేర్లు లేకుండా జాబితా విడుదల కాదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ముఖేష్ అంబానీ ఆ లిస్ట్‌లో ప్రముఖంగా, అగ్రస్థానంలో ఉంటుండగా..ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా తన సత్తా చాటుతున్నాడు.

బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్

టెస్లా కాదు గిస్లా కాదు, బెజోస్ బాబులాగా తన సంపద పెంచేసుకున్నాడీ గుజరాతీ సేఠ్..పోర్టులు,పవర్ ప్లాంట్‌లే బ్యాక్‌బోన్‌గా పవర్ ప్లే ఆడుతున్నాడు.ఒక్క 2021లో తన సంపద ఏకంగా 16.2 బిలియన్ డాలర్లు పెంచుకున్నాడు. మొత్తంగా ఆయన సంపద 50బిలియన్ డాలర్లకు చేరింది. ఆస్తుల పరంగాబెజోస్, ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీతో పోటీ పడలేదు కానీ, నెట్‌వర్త్ పెరిగిన తీరులో మాత్రం గౌతమ్ అదానీ వారందరికంటే ముందంజలో ఉన్నాడు.దీనికి అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ర్యాలీ కూడా బాగా సాయపడింది. ఒక్క స్టాక్ తప్ప అన్ని కంపెనీల షేర్లూ 50శాతం పెరిగి లాభాల పంట పండించడంతో గౌతమ్ అదానీ ఆస్తులు కూడా ఎగశాయ్.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్

ఇదే సమయంలో ముఖేష్ అంబానీ ఆస్తులు 8.1 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగాయి. ఆయన కంటే రెట్టింపు స్థాయిలో గౌతమ్ అదానీ సంపద పెరగడంతో ముఖేష్ చిన్నబోయినట్లే లెక్క. టోటల్ ఎస్ఏ, వాబర్గ్ పింకస్ నుంచి పెట్టుబడులు కూడా ఈ మద్యనే రాబట్టిన గౌతమ్ అందానీ ఎయిర్ పోర్ట్, సీపోర్ట్స్‌తో పాటు డేటా సెంటర్లు కోల్‌మైన్లు చేజిక్కించుకుంటూ తన కాంగ్లోమెరేట్ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నాడు.


ఐతే ఇలా సంపద పోగేయడం వెనుక కుట్రలు,కుతంత్రాలు,చాటు ఒప్పందాలు అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే ప్రచారానికి, విమర్శలకు లెక్కే లేదు. ఐతేనేం, ఏం ఎలాన్ మస్క్‌పై వివాదాలు లేవా, అమెజాన్-జెఫ్ బెజోస్‌పై ఎన్ని కాంట్రవర్సీలు ఎన్ని లేవు.అయితే మనకి దూరపుకొండలు నునుపు కాబట్టి..వారి సంపదని, వ్యాపారదక్షతని మాత్రమే చూస్తాం. మన దేశంలోని సంపదకారులపై మాత్రం విమర్శలు గుప్పిస్తుంటాం.

అదానీ టోటల్ గ్యాస్ 96శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 90శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 79శాతం, అదానీ పవర్, పోర్ట్స్ 52శాతం వరకూ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పెరిగాయ్. అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఏడాదిలో 500శాతం ర్యాలీ చేయగా, ఈ సంవత్సరం మరో 12శాతం పెరిగింది.

ALSO READ :Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story