Adani Group: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై షేర్‌హోల్డర్లకు గౌతం అదానీ సందేశం

Adani Group: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై షేర్‌హోల్డర్లకు గౌతం అదానీ సందేశం

అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. అవి తప్పుడు సమాచారం, కాలం చెల్లిన, అపఖ్యాతి పాలు చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలు అని అభివర్ణించాడు. భారత మార్కెట్లను అస్థిరపచాలనే ఉద్దేశ్యం వారి ఆరోపణల్లో కనిపించిదన్నారు. కంపెనీ వార్షిక నివేదికలో షేర్ హోల్డర్లకు ఈ అంశంపై ఒక సందేశం పంపాడు.

"భారతదేశ గణతంత్ర దినోత్సవం రోజున భారతదేశంలోనే అత్యంత పెద్దదైన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌ (FPO)కి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. కానీ అమెరికాకి చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ కంపెనీ దురుద్దేశ్యం, సొంత లాభాల కోసం, మన గ్రూప్ సంస్థల్ని అపఖ్యాతి పాలుచేసేలా, తప్పుడు సమాచారంతో కూడిన రిపోర్ట్ ప్రచురించింది. మన షేర్లు పడిపోతే వారు లబ్ధిపొందాలనుకున్నారు" అని వెల్లడించాడు.

వారి అసత్య ఆరోపణల కారణంగా కంపెనీ అనేక ప్రతికూల పరిణామాల్ని ఎదుర్కొందని పేర్కొన్నాడు.

కంపెనీ ఆ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కానీ కొందరు అవకాశవాదులు, గిట్టనివారు ఈ ప్రతికూల పరిణామాలకు ఆసరాగా తీసుకుని తమకు అనుకూలంగా మలచుకోవడానికి మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా తమకు అనుకూలంగా తప్పుడు కథనాలు ప్రచారం చేశారని విమర్శించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ కూడా ఉల్లంఘనలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు గుర్తించలేదని గుర్తు చేశాడు.


"కంపెనీ చేపట్టిన ఉపశమన చర్యలను కమిటీ గుర్తించడంతో విశ్వాసం పెరిగింది. భారత మార్కెట్లను అస్థిర పరిచే ఆరోపణలు అందులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఎటువంటి నియంత్రణా, రెగ్యులేటరీ ఉల్లంఘనలను గుర్తించలేదు. మా గ్రూప్ పాలన, బహిర్గత పరిచే నివేదికల ప్రమాణాలపై నమ్మకం ఉంది" అని షేర్ హోల్డర్లకు వివరించాడు. త్వరలోనే రెగ్యులేటరీ సంస్థ సెబీ కూడా నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

పలు ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హెండెన్‌ బర్గ్ నివేదిక సంచలనం సృష్టించింది. కంపెనీలో మోసపూరిత లావాదేవీలు, షేర్ల విలువను కావాలని పెంచడం, ఇతర అకౌంటింగ్ మోసాలను ఎత్తిచూపుతూ ఒక నివేదికను బహిర్గతం చేసింది. దీంతో అదానీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టైన 10 కంపెనీ షేర్లు కుప్పకూలాయి. ఆ సమయంలో గ్రూప్‌లోని పలు కంపెనీలు దాదాపు 50 శాతానికి పైగా నష్టపోయి దారుణ పతనాన్ని చూశాయి. మళ్లీ తర్వాత కోలుకున్నా మునుపటి వేగం షేర్లలో కనబడటం లేదు.



Tags

Read MoreRead Less
Next Story