గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్.. పసిడి ధర పైపైకి!

గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్.. పసిడి ధర పైపైకి!
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. పసిడి ధర పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తుంది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగింది. రూ.48,000కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగింది. రూ. 52,360కు చేరింది.

మంగళవారంతో పోలిస్తే బుధవారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760పెరిగింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ..51,600 గా ఉంది. బుధవారం రూ.52,360కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. మంగళవారం రూ.47,300గా ఉంది. బుధవారం రూ.700 పెరగటంతో రూ.48,000కు ఎగసింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,950గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,320గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,260గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా ఉంది.


గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 06-01-2021 ఉదయం 9 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story