గుడ్ న్యూస్.. దిగొచ్చిన వెండి ధర.. పడిపోయిన పసిడి..

గుడ్ న్యూస్.. దిగొచ్చిన వెండి ధర.. పడిపోయిన పసిడి..
పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర పడిపోయింది. వెండి ధర కూడా పసిడి దారిలోనే దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.50,950కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.46,700కు దిగొచ్చింది.

మంగళవారంతో పోలిస్తే బుధవారం ధరలు బాగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 క్షీణించింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280 గా ఉంది. బుధవారం రూ.50,950కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. మంగళవారం 47,100గా ఉంది. బుధవారం రూ.400 తగ్గుదలతో రూ.46,700కు దిగొచ్చింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,180 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,480గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,230 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,820గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,250 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,960 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,710 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,960 ఉంది.

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,300కి క్షీణించింది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 72,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ,కోల్‌కతాలో రూ. 68,000గా ఉంది. ఇక బెంగుళూరులో కేజీ వెండి ధర రూ. 68,300గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 30-12-2020 ఉదయం 9 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story