ఓరి మీ ప్రేమ బంగారం కానూ, మరీ ఇంతగా దింపేస్తున్నారా..! మార్చిలో రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్ ఇంపోర్ట్స్

ఓరి మీ ప్రేమ బంగారం కానూ, మరీ ఇంతగా దింపేస్తున్నారా..! మార్చిలో రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్ ఇంపోర్ట్స్
ఏకంగా 471శాతం ఎక్కువగా దిగుమతులు జరిగాయంటే బంగారంపై ఎంత నమ్మకం ఉంటే ఈ స్థాయిలో డంప్ చేస్తారో అర్ధం చేసుకోవచ్చు.

దేశంలో బంగారం రేటు బాగా తగ్గిపోయిందని అనుకుంటున్నారా, దానికి మరో రీజన్ కూడా ఉంది. డిమాండ్ అండ్ సప్లై సూత్రం కూడా రేటు తగ్గడానికి కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత నెలలో మున్నెన్నడూ లేనంత స్థాయిలో బంగారాన్ని మనోళ్లు దిగుమతి చేసుకున్నారట. ఏకంగా 471శాతం ఎక్కువగా దిగుమతులు జరిగాయంటే బంగారంపై ఎంత నమ్మకం ఉంటే ఈ స్థాయిలో డంప్ చేస్తారో అర్ధం చేసుకోవచ్చు.

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ఔన్స్‌కు 2072 డాలర్ల రేటు 2020 ఆగస్ట్‌లో పలికింది. అదే హయ్యెస్ట్ రేటు. ఆ తర్వాత అక్కడ్నుంచి 17శాతం పతనమైంది. మన దేశంలోనూ 50వేలు దాటిన పదిగ్రాముల బంగారం ధర ఓ దశలో 60వేలు కూడా అవుతుందనుకునేలా కేక పుట్టించింది. ఐతే అక్కడ్నుంచి రేట్లు పడిపోతూ ప్రస్తుతం రూ.40వేలకి కిందకి కూడా పడిపోద్దేమో అనే డౌట్ క్రియేట్ చేశాయ్

ఐతే మార్చి నెలలో బంగారం దిగుమతి ఏకంగా 160టన్నులకు పెరగడం దేశంలో రాబోయే కాలంలో ఈ ప్రీషియస్ మెటల్‌కి ఏర్పడబోయేడిమాండ్‌ని దృష్టిలో పెట్టుకునే అంటారు. ఐతే దీనికి ఇంపోర్ట్ పన్నులు తగ్గించడం కూడా ఓకారణమంటూ కేంద్రం చెప్తోంది. ఫిబ్రవరి నెలలో కేంద్రం గోల్డ్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ ను 12.5 శాతం.నుంచి 10.75శాతానికి తగ్గించింది. దీనికి తోడు భారీగా పెరిగిన రేటు దాదాపు 20శాతం పతనం కావడం కూడా బయ్యర్లు, జ్యూయెల్రీ బిజినెస్‌మెన్‌లో బయింగ్ ఆపర్చునిటీగా కనపడటంతో వెంటనే తక్కువ రేటులో దొరకబుచ్చుకున్నారు

మరి గోల్డ్ ఇలా భారీగా దిగుమతి చేసుకుంటే ఏం జరుగుతుందంటే, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది.మార్చి క్వార్టర్‌లో అయితే 321 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే 124 టన్నులు ఎక్కువ. 8.4 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు ఒక్క మార్చి నెలలోనే జరగగా గత ఏడాది మార్చిలో ఈ విలువ 1.23 బిలియన్ డాలర్లు మాత్రమే.

ఐతే ఏప్రిల్‌లో మాత్రం ఈ దిగుమతుల ఊపు బాగా తగ్గిపోయి 100టన్నుల లోపుకే పడిపోతుందని వ్యాపారస్తుల అభిప్రాయం. ఎందుకంటే కరోనా కేసులతో లాక్‌డౌన్ విధిస్తారేమో అన్న భయాలు నెలకొనడమే కారణం.

Tags

Read MoreRead Less
Next Story