ఈ వారం పసిడి ధరలు పెరిగే అవకాశం: బులియన్ మార్కెట్ నిపుణులు

ఈ వారం పసిడి ధరలు పెరిగే అవకాశం: బులియన్ మార్కెట్ నిపుణులు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి. ఓ సమయంలో 1700 డాలర్ల దిగువకు పడిపోయిన ఫ్యూచర్ ఇప్పుడు 1750 డాలర్ల దిశగా కనిపిస్తోంది. ఈ వారంలో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని, అయితే అది స్వల్పంగానే ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పసిడి 1735 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఇది 1744 డాలర్లు క్రాస్ చేస్తే 1787 డాలర్ల దిశగా దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

రూ.45వేల దిగువనే బంగారం గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, రూ.45వేల దిగువనే ఉంది. ఫ్యూర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.152.00 (0.34%) పెరిగి రూ.44965.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,890 వద్ద ప్రారంభమై గరిష్టంగా రూ.44,965, కనిష్టంగా 44,890 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.11,300 కంటే తక్కువ వుంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే వీటి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ. 53.00 (0.08%) పెరిగి రూ.66972 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,930 వద్ద ప్రారంభమై గరిష్టంగా రూ.67,052 వద్ద, కనిష్టంగా రూ.66,896 వద్ద తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1750 డాలర్ల దిశగా వెళుతోంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.45 డాలర్లు పెరిగి 1,735.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూర్స్ 26 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర 0.041 డాలర్లు తగ్గి 25.963 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story