Top

తగ్గిన బంగారం ధరలు.. వెండి మాత్రం..

పుత్తడి రేటు నేలచూపులు చూస్తోంది. మళ్లీ స్వల్పంగా తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు నిలకడగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

తగ్గిన బంగారం ధరలు.. వెండి మాత్రం..
X

పుత్తడి రేటు నేలచూపులు చూస్తోంది. మళ్లీ స్వల్పంగా తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు నిలకడగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 క్షీణించింది. దీంతో రేటు రూ.46,080కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గి రూ.42,240కు వద్ద ఉంది.

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.71,800 వద్దనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1738 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.27 శాతం క్షీణతతో 25.98 డాలర్లకు తగ్గింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతున్నాయి.

Next Story

RELATED STORIES