బంగారం ధర స్థిరంగా.. 10 గ్రాముల ధర..

బంగారం ధర స్థిరంగా.. 10 గ్రాముల ధర..
నేడు బంగారం ధరలో స్థిరత్వం కొనసాగుతోంది.

Gold: నిన్న కాస్త పెరిగిన బంగారం ధర ఈ రోజు మాత్రం నిలకడగానే ఉంది. పసిడి ధరలో ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. వెండి ధరలు పడిపోయాయి. హైదరాబాద్‌ మార్కెట్లో గురువారం బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.50,070 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంటే వెండి ధర రూ.200కు దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు తగ్గింది. వెండి ఆభరణాలు, పట్టీలు, కడియాలు వంటివి కొనాలని భావించే వారికి ఇదే మంచి తరుణం.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 0.26 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1890 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించి ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 27.84 డాలర్లకు క్షీణించింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. 0.26 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1890 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 27.84 డాలర్లకు క్షీణించింది.

Tags

Read MoreRead Less
Next Story