మూడోరోజు గోల్డ్ ర్యాలీ..కంటిన్యూ అయ్యేనా

మూడోరోజు గోల్డ్ ర్యాలీ..కంటిన్యూ అయ్యేనా
గత ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో, రూ.56,200 ను తాకిన తరువాత ఈ ఏడాది బంగారం ధరలు అస్థిరంగి కనిపించాయి.

భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు వరసగా మూడోరోజు పెరిగాయి. MCXలో, బంగారు ఫ్యూచర్స్ గత రెండు సెషన్లలో స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. 10 గ్రాములకు 0.4% పెరిగి, 48,038 కు చేరుకుంది. వెండి రేట్లు 0.2% పెరిగి కిలోకు 70,229 వద్ద ఉన్నాయి. అంతకుముందు సెషన్లో బంగారం 1.3% పెరిగింది, యెల్లో మెటల్ మళ్లీ సేఫ్ ఇన్వెస్ట్ గా బావిస్తున్నారు ఇన్వెస్టర్లు.

గత ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో, రూ.56,200 ను తాకిన తరువాత ఈ ఏడాది బంగారం ధరలు అస్థిరంగి కనిపించాయి. ప్రపంచ మార్కెట్లలో, బంగారం శుక్రవారం రెండు నెలల కనిష్టాన్ని తాకింది. తరువాత 3% పెరిగింది. ఔన్స్‌కు 1,841 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్‌లో ఉద్దీపనపై వార్తలు బంగారం వరుసగా మూడవ రోజుకు పెరగడానికి కారణంగా చెబుతున్నారు నిపుణులు. స్పాట్ బంగారం 0.6% పెరిగి ఔన్స్ 1,840.79 కు చేరుకుంది. సిల్వర్, ప్లాటినం కూడా ధరలు స్వల్పంగా పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story